ఆంధ్ర కళా వేదిక-ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా 'ఉగాది' వేడుకలు

- March 23, 2023 , by Maagulf
ఆంధ్ర కళా వేదిక-ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా \'ఉగాది\' వేడుకలు

దోహా: తెలుగు నూతన సంవత్సర పండుగ అయినటువంటి ఉగాదిని పురస్కరించుకొని ఆంధ్ర కళా వేదిక - ఖతార్ కార్యనిర్వాహక వర్గం "ఉగాది వేడుకలు" కార్యక్రమాన్ని ఖతార్ లోని ప్రతిష్టాత్మక వేదిక "రేతాజ్ సల్వా రిసార్ట్" లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 
ముఖ్య అతిధిగా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నుండి విచ్చేసిన మొదటి కార్యదర్శి (రాజకీయ & సమాచారం) పద్మ కర్రీ మాట్లాడుతూ బాషా, కళా, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి మన తెలుగింటి ఆడపడుచు 5 భాషలలో 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఏకైక మహిళా సంగీత స్వర కర్త మరియు ప్లే బ్యాక్ సింగర్ ఎం. ఎం.  శ్రీలేఖ తన సంగీత ప్రయాణంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 25  దేశాలలో ప్రదర్శనలు చేసే ప్రపంచ పర్యటనలో భాగంగా మొట్టమొదటి ప్రోగ్రామ్‌గా ఖతార్ లో ఆంధ్ర కళా వేదిక నిర్వహించిన "ఉగాది వేడుకలు" కార్యక్రమంతో దిగ్విజయంగా ప్రారంభించారు.  ఆమెతో పాటు ప్లేబ్యాక్ సింగర్స్ సాకేత్ కొమాండూరి, జానపద గాయని మౌనిక, సింగర్ రవి మరియు ఇమిటేషన్ రాజు కూడా తమ పాటలతో, మాటలతో మరియు ఆటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు.  కళాకారులూ మాట్లాడుతూ ఖతార్ లోని తెలుగు ప్రేక్షకులు కూడా తమ అద్భుత స్పందనతో మమ్మల్ని అబ్బుర పరిచారు అని ఖతార్ పర్యటన ఎంతో ఆనందానుభూతులను కలుగజేసిందని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమానికి ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నుంచి వినోద్ నాయర్-A/ ప్రెసిడెంట్, కుల్దీప్ కౌర్,  కున్హి, శ్రీ దీపక్ శెట్టి, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) నుంచి కృష్ణ కుమార్-ప్రధాన కార్యదర్శి,  కే.ఏస్. ప్రసాద్-సలహా మండలి చైర్మన్,  సత్యనారాయణ ,సజీవ్ సత్యశీలన్, మోహన్  ఇతర సంఘాల ప్రతినిధులు రవీంద్ర ప్రసాద్ మరియు తెలుగు ప్రముఖులు నందిని అబ్బగౌని, సత్య అనుమళ్ల,హరీష్ రెడ్డి,  కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఖతార్ లోని తెలుగు సంఘాలలో చరిత్ర సృష్టించిందని, కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని,  వేదిక ప్రాంగణ పరిమితికి మించి అభ్యర్థనలు రావడంతో చాలా మందికి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పించ లేకపోయామని, హాజరైన ప్రేక్షకులు సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి ప్రత్యేకించి రవి మెలోడీస్ అధినేత రవి, IGPL అధినేత శ్యామ్ బాబు గంధం, R మాధవరావు పట్నాయక్,  GVNRSSS వరప్రసాద్ కి శాలువా మరియు జ్ఞాపికలతో సత్కరించి  తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి,సుధ, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, KT రావు, శిరీష రామ్, వీబీకే మూర్తి బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేకించి మధు వంటేరు, గోవర్ధన్ అమూరు, ఎల్లయ్య, మను & టీంకి మరియు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లితండ్రులకు, Emote Edition రవి మరియు జ్యోతి కి కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి శ్రీ సుధ మరియు శిరీష లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా చూడామణి వారికీ సహకరించారు.కార్యక్రమంలో భాగంగా శ్రీ లేఖ బృందం చేసిన సంగీత విభావరి, వేదిక ప్రాంగణం, చిన్నారుల నాట్యాలు, రుచికరమైన సాంప్రదాయ తెలుగింటి భోజనం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com